Header Banner

ఏపీ విద్యాశాఖ కొత్త ఆవిష్కరణ! ఇప్పుడు ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇలా!

  Wed Feb 19, 2025 18:56        Education

మార్చి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో హాల్‌టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులు వాట్సప్‌ ద్వారా ప్రాక్టికల్‌ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కాలేజీలు హాల్‌టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రభుత్వం 161 సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యరంగం సేవలు కూడా వాట్సాప్‌ (WhatsApp) ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఏడాది 2025 ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ కలిపి సుమారు 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా వాట్సాప్‌ నంబరు 9552300009 ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈసారి పదో తరగతి విద్యార్థులకూ ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఏపీ 10వ తరగతి పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఇంటర్‌ హాల్‌టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?

  • ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్కి హాయ్ (Hi) అనే వాట్సాప్లో మెసేజ్ చేయగానే.. సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది.
  • దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి.
  • అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి.
  • అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయగానే.. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.
  • దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే సింపుల్గా డౌన్లోడ్ అవుతుంది.

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు ఆయా తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2025:

  • మార్చి 1 - సెకండ్ లాంగ్వేజీ పేపర్ -1
  • మార్చి 4 - ఇంగ్లీష్ పేపర్ -1
  • మార్చి 6 - మ్యాథమెటిక్స్ పేపర్ -1A, బోటానీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
  • మార్చి 8 - మ్యాథమెటిక్స్ పేపర్ -1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
  • మార్చి 11 - ఫిజిక్స్ పేపర్-1, ఎకానమిక్స్ పేపర్-1
  • మార్చి 13 - కెమిస్ట్రీ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, కామర్స్ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
  • మార్చి 17 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్1, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్ పేపర్ -1 (బైపీసీ విద్యార్థులకు)
  • మార్చి 19 - మోడ్రన్‌ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి.

 

ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ 2025:

 


   #AndhraPravasi #Andhrapradesh #education #APStudents #Academic #naralokesh #chandrababu #pawankalyan